బెంగళూరులో ఘోర ఘటన చోటుచేసుకుంది. సిగరెట్ విషయంలో జరిగిన చిన్న వివాదం ఓ ప్రాణాన్ని తీసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ తన స్నేహితుడితో సిగరెట్ కాలుస్తుండగా.. కారులో వచ్చిన ప్రతీక్ సిగరెట్ తీసుకురావాలని కోరాడు. అప్పుడు సంజయ్ అతనిని సోమరిపోతు అన్నాడు. దీనిపై ఆగ్రహించిన ప్రతీక్ కారుతో సంజయ్‌ను ఢీకొట్టి హత్య చేశాడు.