సినిమాలతో పాటు కారు రేసింగ్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్న నటుడు అజిత్ ఇటీవల తన ప్రాజెక్ట్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా, రేసింగ్ రెండింటికీ సమాన న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు. అందుకే రేసింగ్ సీజన్‌లో సినిమాలకు విరామం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రేసింగ్ కోసం 42 కిలోల బరువు తగ్గానన్నారు.