ఏపీలో పలు పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నివాస, బర్త్, డెత్ ధృవీకరణ, ఆదాయ, అడంగల్, విద్య సంబంధిత పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. విద్యుత్ శాఖలో 39, ఆర్టీసీలో 9, RTAలో 4, గ్రీవెన్స్‌లో 6, రెవెన్యూలో 16, మున్సిపల్, పంచాయతీరాజ్ సహా మొత్తం 150 సేవలు వాట్సాప్ ద్వారానే పొందవచ్చన్నారు. దీని ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తప్పుతుందని స్పష్టం చేశారు.