టీడీపీలో వర్గపోరు.. మంత్రి జనార్దన్‌రెడ్డి ముందే ఘర్షణ

61చూసినవారు
టీడీపీలో వర్గపోరు.. మంత్రి జనార్దన్‌రెడ్డి ముందే ఘర్షణ
AP: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సాక్షిగా ఘర్షణకు నేతలు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్