AP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా తమ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా మూడో శనివారం అందరూ తమ ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.