ఏపీ కేబినెట్ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మంత్రులు ప్రో యాక్టివ్‌గా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు స్పీడ్ పెంచాలని, అదే సమయంలో సమర్థంగా పని చేయాలంటూ చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి రోజు ముఖ్యమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు సమానంగా పని చేయాలని మంత్రులకు చంద్రబాబు హితవు చెప్పారు.