
యువకుడిని దారుణంగా చంపిన మహిళ
AP: ఓ మహిళ యువకుడిని తలపై బలంగా కొట్టి హతమార్చింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పెనుగొండ చినమల్లానికి చెందిన చంద్రశేఖర్(29) కూలి పనులు చేస్తుంటాడు. నరేంద్రపురానికి చెందిన ఓ మహిళతో చంద్రశేఖర్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని యువకుడు భరించలేకపోయాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మహిళ అతనిపై పప్పుగుత్తి, ఇనుపగొట్టంతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.