AP: రాష్ట్ర మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంత్రుల ఓఎస్‌డీల అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న సీఎం.. సుమారు 10 మంది మంత్రుల ఓఎస్‌డీలపై చర్యలకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. అలాగే, మంగళవారం కేబినెట్ ఎజెండా ముగిసిన అనంతరం ఈ అంశంపై సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నట్లు చర్చ జరుగుతోంది.