సీఎం చంద్రబాబు పలువురు మంత్రులపై సీరియస్ అయినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై వైసీపీ విమర్శలకు దిగినా మంత్రులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. మతపరమైన విషయాల్లో వైసీపీ విమర్శలు చేయడం అలాగే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు, తిరుమలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించకపోవడంతో పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.