తానా సభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబును ఆ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.