మహాత్మాగాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. అహింసను పరమ ధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతఃస్మరణీయుడని.. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో గాంధీ ఒకరని లోకేష్ అన్నారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని మంత్రి తెలిపారు.