ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగగా తల్లికి వందనం, మత్స్యకార భరోసా వంటి సంక్షేమ పథకాల అమలుపై చర్చించి దాదాపు 21 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే మూడు నెలల్లో జనంలోకి వెళ్లాలని, సంక్షేమ పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.