ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు కీలక సూచన చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో 1995లో ఈ గవర్నెన్స్.. 2025లో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ పోస్ట్ చేశారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవల కోసం ప్రజలు 9552300009 నెంబర్‌ను వాడాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన`వాట్సాప్ పాలన` గురువారం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తొలి దశలో 161 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు.