టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్

10చూసినవారు
AP: టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ టీడీపీకి వీరాభిమాని. క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తన ఆరోగ్యం క్షీణించడంతో సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని అతను కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అన్నివిధాలా కుటుంబానికి అండగా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్