AP: హైదరాబాద్‌లోని మీర్ చౌక్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.