ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. దూబగుంటలో నేడు స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.