హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తూ గాయపడిన ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సుజనాచౌదరి త్వరగా కోలుకొని, తిరిగి ప్రజాసేవకు పునరంకితం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.