హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాల్వ పనులు, ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జులై 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫేజ్-2 పనులు పూర్తి చేసి జులై31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీళ్లు అందించాలన్నారు. గాలేరు-నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.