సీఎం చంద్రబాబు జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. అలాగే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించి నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.