సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌.. వైసీపీ ట్రోల్స్‌

80చూసినవారు
సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌.. వైసీపీ ట్రోల్స్‌
ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. శనివారం అన్న‌మ‌య్య జిల్లాలో పర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు అనేక ప‌థ‌కాల‌పై క్లారిటీ ఇచ్చారు. ఇదే క్ర‌మంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఉపాధి హామీ ప‌నుల బ‌కాయిలు వీలైనంత త్వ‌ర‌గా చెల్లిస్తాన‌ని హామీ ఇచ్చారు. చంద్ర‌బాబు ఇలా చెప్ప‌డంతో వైసీపీ ట్రోల్స్ మొద‌లుపెట్టింది. నువ్వు అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేక మీ పార్టీ కార్యకర్తల కడుపు నింపడానికా అంటూ వైసీపీ ట్రోల్స్ మొద‌లుపెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్