గ‌త ప్ర‌భుత్వంపై సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

602చూసినవారు
గ‌త ప్ర‌భుత్వంపై సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది అత్యాశతో తప్పుచేశార‌ని అన్నారు. వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలగాలని, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. పరిపాలన ప్రజల కోసం చేయాలి. సంక్షేమం, అభివృద్ధి బేరీజు వేసుకుంటూ వెళ్లాల‌ని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశామ‌న్నారు. నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయని, ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్