సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం: 'తల్లికి వందనం' కింద రూ.15వేలు జమ

74చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం: 'తల్లికి వందనం' కింద రూ.15వేలు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ.15,000 చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికీ రూ.15,000 అందజేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పథకం కింద మొత్తం రూ.8,745 కోట్లు రేపు తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా రేపటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే.

సంబంధిత పోస్ట్