AP: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ వేడుకలు ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు జరగనున్నాయి. 25వ తేదీన చంద్రబాబు ప్రభుత్వం తరఫున హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి (ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటివరకు మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు.