ఏపీలోని కూటమి ప్రభుత్వంపై YCP 'X' వేదికగా పలు విమర్శలు చేసింది. సూపర్-6 హామీలు అమలు చేయకుండానే, 8 నెలల్లోనే చంద్రబాబు రూ. 1 లక్ష కోట్లు అప్పు చేశారని ఆరోపించింది. సంపద సృష్టిస్తానని గప్పాలు కొట్టిన చంద్రబాబు.. గెలిచాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారని మండిపడింది. గత మంగళవారం రూ.5,820 కోట్లు అప్పు చేసిన CM.. మరోవైపు ప్రజలపై ఛార్జీల రూపంలో 'బాదుడు' మొదలు పెట్టారని రాసుకొచ్చింది.