కోల్కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని నినదించారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌పై దాడి జరిగిన ఘటనలో హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నాయకులు నిజం బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.