టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరిగా ఖ్యాతి గాంచిన ప్రకాశం పంతులు త్యాగం, ధైర్యసాహసాలు అందరికీ ఆదర్శమని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, అలాంటి మహనీయునికి నివాళులర్పించడం గౌరవకార్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో(ట్విట్టర్) ట్వీట్ చేశారు.