రాజస్థాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాదర్ సమర్పించారు. అజ్మీర్ దర్గాలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉరుసు సందర్భంగా శనివారం రేవంత్ రెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత పెద్దల సమక్షంలో దర్గాకు చాదర్ సమర్పించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అలీఖాన్, మైనార్టీ నాయకులు ఉన్నారు.