మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. బీసీ కులగణన రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఆ కులగణన రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నివేదికను క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.