AP: ఇన్‌ఛార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్జీలు తీసుకోవాలి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా ఇన్‌ఛార్జ్‌లు వ్యవహరించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలి.’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.