AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో CBN స్పందించారు. అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, ఉదయం 7 నుంచి సాయంత్రం 6లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా.. పొలంలోనో, ఆస్పత్రిలోనో, ఇతర ప్రాంతంలోనో పెన్షన్లు పంపిణీ చేసినట్లు తేలితే వాటికి కారణాలను విశ్లేషించాలన్నారు.