రేష‌న్ కార్డుల‌పై కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!

56చూసినవారు
రేష‌న్ కార్డుల‌పై కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నవ దంపతులకు కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించే దిశగా ఆన్‌లైన్‌ పోర్టల్ తెర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతోపాటు రేషన్‌ కార్డు రూపురేఖల్ని మార్చే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తుంది. క్రెడిట్‌ కార్డు తరహాలో.. క్యూఆర్‌ కోడ్‌తో రేష‌న్ కార్డుల‌ను జారీ చేయనుంది. బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం ఈ ప్రక్రియ ప్రారంభించ‌నున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్