AP: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతుల తరుఫున ప్రీమియం కింద రూ.700 కోట్లు చెల్లించడాన్ని భారంగా చూపుతూ కూటమి ఈపథకాన్నే పూర్తిగా ఎత్తేసేందుకు సిద్దపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం అంటే చంద్రబాబుకు చిన్నచూపే ఇందుకు కారణమని ధ్వజమెత్తారు.