మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్‌‌చల్ (వీడియో)

51చూసినవారు
AP: నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. పామును చూసిన భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకుని స్నేక్ స్నాచర్ మోహన్‌ను పిలిపించారు. నాగుపామును మోహన్ చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్