తిరుమల శ్రీవారిని కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆయనకు రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.