శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కొలొంబో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ శ్రీలంక అభిమాని చోక్లీ అంటూ పిలిచిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలు రేగాయి. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి అద్భుతంగా ఆడారని గుర్తుచేయగా, మరి కొందరు అది ఫేక్ వీడియోగా అభివర్ణించారు. కాగా, ముఖ్యమైన మ్యాచ్‌లలో విఫలమయ్యే ఆటగాళ్లని చోకర్ అని పిలుస్తారు. దానికి కోహ్లి పేరు కలిపి చోక్లీగా అభివర్ణించాడు.