AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డికి మరో షాక్ తగిలింది. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలపై అమరావతి మహిళా రైతులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని.. ఆ తర్వాత సజ్జల వ్యాఖ్యలు ఇంకా బాధించాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.