తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ కులగణన చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. ఏపీలో కూడా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం చంద్రబాబును ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.