బిహార్ రాష్ట్రం పూర్నియాలోని గులాబ్‌నాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రేమ విషయమై ఇద్దరు విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారు. ఇద్దరికీ ఈ విషయం తెలవడంతో బహిరంగంగా గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, విద్యార్థినుల ప్రవర్తనపై పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.