విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గందరగోళం

84చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గందరగోళం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది. దాదాపు 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి తగ్గిందని, అందుకే కార్మికులను తొలగించామని యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో స్టీల్ ప్లాంట్ లోపల కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులను తొలగించడంపై స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్