ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్‌పై సెటైర్లు వేస్తూ… కంగ్రాట్స్ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీని గెలిపించారంటూ ఎద్దేవా చేశారు. అయితే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. ఈ క్రమంలోనే కేటీఆర్ కాంగ్రెస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.