ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న టీచర్లకు అభినందనలు: లోకేశ్‌

83చూసినవారు
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివిస్తున్న టీచర్లకు అభినందనలు: లోకేశ్‌
AP: ప్రభుత్వ విద్యకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారి, ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న టీచర్లకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ‘ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు మధుబాబు, రాజేంద్రప్రసాద్‌, కరుణాకర్‌రావుకు హ్యాట్సాఫ్‌’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్