ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా వెనుకంజలోనే కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో లేదు. అన్నిచోట్ల మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది.