ఏపీ హైకోర్టుకు దీపావళి పండుగ నేపథ్యంలో ఐదు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. దీపావళికి ఈ నెల 30,31న సెలవులు ఇచ్చారు. అయితే నవంబర్ 1న హైకోర్టు, దాని పరిపాలన పరిధిలో పని చేసే న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, తదితర సంస్థలకు సెలవు ఇస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 2న భాయ్దూజ్ పండుగ, 3న ఆదివారం కావడంతో హైకోర్టు తిరిగి 4న ప్రారంభమవుతుంది.