AP: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 138 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాలపరిమితిని జూన్ 1 నుంచి 11 నెలల పాటు కొనసాగిస్తూ జీవో జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వారు విధుల్లో కొనసాగుతారని పేర్కొంది.