శాస్త్రవేత్తలు ఎయిడ్స్ వ్యాక్సిన్ కోసం నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. 1987లో 188 మందితో ఎయిడ్స్ వ్యాక్సిన్ పరిశోధన మొదలైంది. రెండు మూడుసార్లు ప్రయత్నించినా వ్యాక్సిన్లు పనిచేయలేదు. ఈ వ్యాక్సిన్లు HIVతో పోరాడే సామర్థ్యం మాత్రమే చూపించాయి. ఆ తర్వాత మరో వ్యాక్సిన్‌ను పరీక్షించగా.. అది నివారణ సామర్థ్యం కలిగి ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటివరకు ఆమోదం లభించలేదు.