టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి అనిత సూచించారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమని పేర్కొన్నారు.