ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతమే దీనికి ఉదాహరణ. ఆ విషయంలో ప్రజలంతా ఉద్యమించగా నాటి కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు.. వాటిపై అవగాహన కల్పించాలి.