రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి

61చూసినవారు
రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
TG: మోటారు వాల్వును పరిశీలించడానికి భీమానదిలోకి వెళ్లిన రైతును ఓ మొసలి లాక్కెళ్లింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కుసుమర్తిలో చోటు చేసుకుంది. రైతులు తిప్పణ్ణ, శివప్పగౌడ శనివారం మధ్యాహ్నం తమ పొలాలకు వెళ్లారు. పొలంలో ఉన్న పైపుకు నీరు రాకపోవడంతో మోటారు వాల్వ్ పరిశీలించడానికి తిప్పణ్ణ (50) నదిలోకి దిగారు. అక్కడే ఉన్న మొసలి తిప్పణ్ణపై దాడిచేసి నదిలోకి లాక్కొని పోయింది. అర్ధరాత్రి వరకూ వెతికినా ఆచూకీ లేదు.

సంబంధిత పోస్ట్