తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

85చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు తెలిపారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే స్వామివారి దర్శనమవుతుండగా.. టికెట్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోందన్నారు. శుక్రవారం 62,625 మంది స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్