బిహార్‌లో ఓ వ్యక్తి మూగ జీవాలపై అత్యంత క్రూరత్వంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. భాగల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆలమ్ అనే వ్యక్తి చెట్టుపై నిలబడి ఓ కుక్క తోకకు తాడు కట్టి దానిని అటూఇటూ ఊపుతూ హింసించాడు. ఆలమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి రీల్స్ చాలా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.